- ఎస్సీ నేత వెంకటేశం డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: సంక్షేమ పథకాల్లో 57 ఎంబీఎస్సీ (మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్) కులాలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్ చేశారు. ఉపకులాల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బైరి వెంకటేశం మాట్లాడుతూ.. దళితుల్లో అత్యంత వెనుకబడిన 57 ఉప కులాలకు, వారి వృత్తుల అభివృద్ధికి ప్రత్యేక డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కోరారు. చర్మకార వృత్తిపై ఆధారపడిన కులాల అభివృద్ధి కోసం లిడ్ క్యాప్ ద్వారా కేటాయించబడిన భూములలో లేదర్ పార్కులను ఏర్పాటు చేసి రాష్ట్రంలో తోలు పరిశ్రమను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కాలేజీల్లో ఎస్సీ ఉప కులాలకు 15 శాతం ఫ్రీ సీట్లు కేటాయించేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.